Supreme Court | నా మెదడును మిషన్‌తో కంట్రోల్ చేస్తున్నారు
Supreme Court | నా మెదడును మిషన్‌తో కంట్రోల్ చేస్తున్నారు
సుప్రీంకోర్టులో కేసు వేసిన స్కూల్ టీచర్
Hyderabad : ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన మెదడును మెషీన్ ద్వారా నియంత్రిస్తున్నారని ఓ స్కూల్ ఉపాధ్యాయుడు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. పైగా తన మెదడులోని మెషిన్ అది పనిచేయకుండా దానిని డీయాక్టివేట్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సదరు పెద్దమనిషి తన పిటిషన్‌లో కోరాడు. తాజాగా ఈ పిటీషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు దానిని కొట్టివేసింది. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచిత్రమైనదిగా అభివర్ణించారు. దానిని విచారించేందుకు నిరాకరిస్తూ అభ్యర్ధనను తిరస్కరించింది.
అసలేం జరిగిందంటే..
కొందరు వ్యక్తులు హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) నుంచి మనిషి మెదడును చదివే ‘హ్యూమన్ బ్రెయిన్ రీడింగ్ మెషినరీ’ని కొంత మంది వ్యక్తులు కొనుగోలు చేశారని, దాని ద్వారా తన మెదడును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారని ఏపీకి రాష్ట్రానికి చెందని ఓ ఉపాధ్యాయుడు ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. తొలుత ఏపీ హైకోర్టులో ఈ పిటీషన్ వేయగా అప్పీలు దారుని ఆరోపణలు నిరాధారమని కోర్టు సెప్టెంబర్ 27న కొట్టివేసింది. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
తాను కొనుగోలు చేసి దాని ద్వారా తన మెదడును నియంత్రిస్తున్నారని ఏపీకి చెందిన ఉపాధ్యాయుడొకరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇతగాడి పిటిషన్‌ను సుప్రీం కోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ (ఎస్‌సీఎల్‌ఎస్‌సీ)కి దానిని పంపారు. అప్పీలుదారుని సమస్య పూర్తిగా అర్ధం చేసుకోవడానికి అక్కడి అధికారులు అతనితో తెలుగులో మాట్లాడారు. అతడి మాటలను బట్టి తన మెదడుపై ప్రభావం చూపుతున్నట్లు ఆరోపించిన యంత్రాన్ని నిష్క్రియం చేయడానికి విశాఖపట్నంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కార్యాలయాన్ని ఆదేశించాలని కోరాడు. అయితే పిటిషన్ దారుడి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న కమిటీ అతడి మెదడును ఎవరూ యంత్ర పరికరం ద్వారా నియంత్రణ చేయడం లేదని, అతని ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని నివేదిక ఇవ్వడంతో సుప్రీం కోర్టు అతడి పిటిషన్‌ను కొట్టివేసింది.
* * *
Leave A Comment